మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన..

322
- Advertisement -

బుధవారం మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. తెలంగాణ భవన్‌లో టి.ఆన్.జి.ఓ నిర్వహించిన రక్త దానం శిబిరంలో పాల్గొని అనంతరం జిల్లా కేంద్రంలో మురికి నీటి కలువలకు శంఖుస్థాపన చేశారు. అతరువాత హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, ఇఫ్సికో చైర్మన్ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

harish

ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. రైతులకు ఎప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోడుగా ఉంటుందని..రైతు ప్రభుత్వంగా రైతుకు వెన్నంటే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉన్నాడని, కరోనా వైరస్ సమయంలో కుడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. అంతేకాదు రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం.పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది అని మంత్రి హరీష్ తెలిపారు.

- Advertisement -