ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ20మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 5బంతుల్లో 9పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 42బంతుల్లో 41పరుగులు చేశారు.
ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 17బంతుల్లో 15పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 13బంతుల్లో 22పరుగులు చేశాడు. కాగా 149పరగులతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచారు.
బంగ్లా బ్యాట్స్‌మెన్లలో లిటన్ దాస్-7, మొహమ్మద్ నయీం-26, సర్కార్-39 పరుగులు చేసి ఔటవ్వగా ముస్తఫిజుర్ రహీం- 60, మహ్మదుల్లా-15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.భారత్ బౌలర్లలో డీఎల్ చాహర్, అహ్మద్, చావల్‌కు తలో వికెట్ పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది.