బంగ్లా మాజీ కెప్టెన్‌కు హార్ట్ ఎటాక్

2
- Advertisement -

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌ ఆస్పత్రి పాలయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మహమ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నారు తమీమ్‌. సోమవారం సావర్‌లో షైన్‌పుకూర్‌ క్రికెట్‌ క్లబ్‌ తో మ్యాచ్ సందర్భంగా ఛాతిలో నొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. గుండెలో ఒక వాల్ బ్లాక్ అయ్యిందని, స్టెంట్ వేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

మ్యాచ్‌ ఆడుతుండగా తమీమ్‌ ఇక్బాల్‌ ఛాతిలో నొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడని, మైదానంలో ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఫిజీషియన్‌ దేవాశిష్‌ చౌధరి చెప్పారు.

Also Read:పదో తరగతి పేపర్ లీక్..6గురికి రిమాండ్

- Advertisement -