బెంగళూరు నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో పింక్ లైన్ (Pink Line) పనులకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ లైన్‌లోని బన్నెరఘట్ట రోడ్డు సెక్షన్‌లో సివిల్ పనులు దాదాపు పూర్తికావడంతో, భద్రతా తనిఖీలు మరియు సిగ్నలింగ్ పరీక్షలను బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) వేగవంతం చేసింది.
పింక్ లైన్ విశేషాలు”
ఈ పింక్ లైన్ మొత్తం 21.26 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ఎలివేటెడ్ సెక్షన్: కలేన అగ్రహార నుంచి తవరేకెరె వరకు (7.5 కి.మీ).
అండర్ గ్రౌండ్ సెక్షన్: డైరీ సర్కిల్ నుంచి నాగవార వరకు (13.7 కి.మీ).
బన్నెరఘట్ట రోడ్డు మీదుగా వెళ్లే ఈ మార్గంలో ట్రాక్ నిర్మాణం మరియు స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రైల్వే సేఫ్టీ కమిషనర్ (CMRS) తనిఖీలకు ముందు నిర్వహించాల్సిన అంతర్గత భద్రతా పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సిగ్నలింగ్ మరియు పవర్ సప్లై వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి త్వరలోనే ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు.
Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్ ఆలయం
పింక్ లైన్ అందుబాటులోకి వస్తే బెంగళూరులోని అత్యంత రద్దీ ప్రాంతాలైన ఐఐఎంబీ (IIMB), జేపీ నగర్, డైరీ సర్కిల్ మరియు ఎంజీ రోడ్డులకు ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. దక్షిణ బెంగళూరు నుంచి ఉత్తర బెంగళూరుకు చేరుకోవడానికి పట్టే సమయం సగానికి పైగా తగ్గుతుంది.
ఈ లైన్‌ను 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బన్నెరఘట్ట రోడ్డు పరిసరాల్లో జరుగుతున్న పనుల వేగం చూస్తుంటే, అనుకున్న సమయానికే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

