బెంగళూరుకు భారీ విజయం

231
Bangalore beat Kings XI Punjab by 10 wickets
- Advertisement -

ఐపీఎల్‌లో బెంగళూరు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. సోమవారం మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమేశ్‌ యాదవ్‌ (3/23) ధాటికి 15.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ముంబయి (87) మొదటి స్థానంలో ఉంది. కోహ్లి, పార్థివ్‌ మెరుపులతో స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 8.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది.

ఫటాఫట్‌…: స్వల్ప ఛేదనలో ఆరంభం నుంచే బెంగళూరు చెలరేగి ఆడింది. ఓపెనర్లు కోహ్లి, పార్థివ్‌ ఎడాపెడా బాదడంతో స్కోరు పరుగులెత్తింది. జట్టు రన్‌రేట్‌ను పెంచడమే లక్ష్యంగా ఆడిన ఈ జోడీ.. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి పంపింది. టై ఓవర్లో పార్థివ్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా, రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో విజృంభించిన కోహ్లి.. సిక్స్‌తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. వీళ్లిద్దరూ పోటాపోటీ ఆడడంతో స్వల్ప లక్ష్యం మరింత స్వల్పంగా కనిపించింది. ముఖ్యంగా విరాట్‌ అద్భుతమైన షాట్లతో అభిమానుల్ని అలరించాడు. టై బౌలింగ్‌లో లాంగ్‌ఆఫ్‌ మీదుగా కళ్లుచెదిరే సిక్స్‌ బాదిన అతను.. స్టాయినిస్‌ బౌలింగ్‌లో రెండు ముచ్చటైన ఫోర్లు లాగించాడు. రాజ్‌పుత్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని బౌండరీకి తరలించిన కోహ్లి బెంగళూరుకు ఘన విజయాన్ని అందించాడు.

Bangalore beat Kings XI Punjab by 10 wickets

పంజాబ్‌: రాహుల్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) ఉమేశ్‌ 21, గేల్‌ (సి) సిరాజ్‌ (బి) ఉమేశ్‌ 18, నాయర్‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 1, ఫించ్‌ (సి) కోహ్లీ (బి) మొయిన్‌ 26, స్టొయినిస్‌ (బి) చాహల్‌ 2, మయాంక్‌ (సి) పార్ధివ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 2, అక్షర్‌ (నాటౌట్‌) 9, అశ్విన్‌ (రనౌట్‌) 0, టై (సి) పార్ధివ్‌ (బి) ఉమేశ్‌ 0, మోహిత్‌ (రనౌట్‌) 3, రాజ్‌పుత్‌ (రనౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 15.1 ఓవర్లలో 88 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-36, 2-41, 3-41, 4-50, 5-61, 6-78, 7-78, 8-79, 9-84, 10-88. బౌలింగ్‌: ఉమేశ్‌ 4-0-23-3, సౌథీ 2-0-19-0, సిరాజ్‌ 3-0-17-1, చాహల్‌ 2-0-6-1, గ్రాండ్‌హోమ్‌ 2-0-8-1, మొయిన్‌ అలీ 2.1-0-13-1.

బెంగళూరు: కోహ్లీ (నాటౌట్‌) 48, పార్ధివ్‌ (నాటౌట్‌) 40, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 8.1 ఓవర్లలో 92/0. బౌలింగ్‌: అశ్విన్‌ 1-0-9-0, టై 4-0-33-0, రాజ్‌పుత్‌ 1.1-0-21-0, మోహిత్‌ 1-0-15-0, స్టొయినిస్‌ 1-0-12-0.

- Advertisement -