ఢిల్లీకి షాక్.. ఐపీఎల్ నుంచి అశ్విన్ అవుట్..

257
R Ashwin
- Advertisement -

ఢిల్లీ కాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కు అశ్విన్ దూరమయ్యాడు. ఢిల్లీ కాపిటల్స్‌కు అశ్విన్‌ కీలకమైన బౌలర్‌ అశ్విన్‌ టీంకు దూరమవడం షాకింగ్‌ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే.. అశ్విన్‌ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో వారిని చూసుకోవడానికి ఐపీల్‌ నుండి వైదొలిగాడు ఈ మేరకు అశ్విన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు.

“రేపటి నుంచి ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి విరమించుకుంటున్నాను. నా కుటుంబీకులు, బంధువులు, కొవిడ్ 19పై పోరాడుతున్నారు. ఈ కష్ట సమయంలో వారికి నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులన్నీ చక్కబడితే తిరిగి పోటీల్లోకి వస్తాను. ధన్యవాదాలు ఢిల్లీ కాపిటల్స్” అని ట్వీట్ చేశారు.

అశ్విన్ ట్వీట్ కు ఢిల్లీ కాపిటల్స్ కూడా స్పందించింది. “మీ కుటుంబం కష్టాల్లో ఉన్న వేళ మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున మీ కుటుంబానికి మద్దతు ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం” అని పేర్కొంది.

- Advertisement -