మతం పట్టు మానవా.. ” బండి ” జీ !

68
- Advertisement -

మత రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరనే సంగతి అందరికీ తెలిసిందే. హిందుత్వనికే అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఇతర మతలపై విషం వెళ్లగక్కుతూ రాజకీయ లభ్ది పొందడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయంగా ప్రతి అంశాన్ని మతానికి ముడిపెడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీ నేతలు ముందువరుసలో ఉంటారు. ఆ కోవలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ముస్లింలే లక్ష్యంగా వారి మతాన్ని కించపరిచేలా మసీదులు కొలగొడతాం.. ముస్లిం అనే వారు లేకుండా చేస్తాం.. అంటూ ఎన్నోమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటారు బండి సంజయ్.

అన్నీ మతాలను సమానంగా చూస్తూ లౌకికత్వాన్ని పెంపొందించవలసిన నాయకుడు మతలమద్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడపడం ఏంటని బండి సంజయ్ పై ఎన్ని విమర్శలు, వ్యతిరేకత వస్తున్నప్పటికి.. కుక్క తోక వంకర అన్నట్లుగా ఆయన మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇటీవల కరీంనగర్ లో హిందు ఏక్తా యాత్ర చేపట్టారు బండి సంజయ్.. ఈ యాత్రలో భాగంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read:Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !

హిందూత్వం లేకుంటే దేశం పాకిస్తాన్ అయ్యేదని, తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావారణాన్ని తీసుకొస్తామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే భారతదేశం సర్వమతల సమ్మేళనం అనే సంగతి బండి సంజయ్ మర్చిపోయారా.. ? దేశంలో హిందూమతం మాత్రమే ఉందని ఆయన భావిస్తున్నారా ? అనే సందేహాలు రాక మానవు. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెబుతున్నా బండి సంజయ్.. ఒకవేళ అధికారంలోకి వస్తే.. ఇతర మాటలకు ఎంతమేర గౌరవం ఇస్తారనే సందేహం ప్రజల్లో వ్యక్తమౌతోంది. మొత్తానికి మతబ్రాంతిలో ఒక మత ప్రభోదకుడిగా బండి సంజయ్.. ప్రవర్తిస్తున్నారే తప్పా అసలైన రాజకీయనేతగా బండి వ్యవహరిచడం లేదనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం.

- Advertisement -