ఆల్‌ టైం రికార్డు.. గణేష్ లడ్డు రూ.కోటి 87 లక్షలు

15
- Advertisement -

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం ప్రారంభమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. నిమజ్జనానికి తరలుతున్నాడు వినాయకుడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్ర జరుగుతోంది.

ఇక గణేశ్ లడ్డూ వేలంలో హైదరాబాద్ బండ్లగూడ గణేశ్‌ రికార్డు నెలకొల్పింది. ఆల్ టైం రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.87 లక్షలు పలికింది. . విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ లడ్డూను సొంతం చేసుకుంది.

గతేడాది ఇదే విల్లాస్‌లోజరిగిన లడ్డువేలంలో 60.80 లక్షలు పలికింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేసి గణపతి లడ్డూ ధర కోటి 87 లక్షల రూపాయిలు పలికింది. ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు.

Also Read:అవిసె గింజలతో లాభాలు!

- Advertisement -