ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మద్య ఉండే రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పు నిప్పు లాగా ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీల మద్య రగడ కొనసాగుతునే ఉంటుంది. ఈ రెండు పార్టీల నేతల మద్య పరస్పర ఆరోపణలు, పరస్పర దూషణలు, వివాదాలు, ఘర్షణలు.. ఇవన్నీ కూడా సర్వసాధారణమే. అలాంటిది ఈ రెండు పార్టీలు కలుస్తాయనే ఆలోచన కల్లో కూడా రాదనే చెప్పాలి. ఇటీవల ఈ రెండు పార్టీల నేతలకు సంబంధించి ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవల తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కపక్కన కూర్చొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ప్రెస్ తో మాట్లాడే సమయం లో కూడా ఇద్దరు పక్కపక్కనే ఉంటూ మీడియాతో మాట్లాడారు..
దీంతో అందరి చూపు ఒక్కసారిగా వీరిద్దరిపై పడింది. రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరు.. ఎంతో సన్నిహిత్యంగా మెలగడం చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి లోనౌతున్నారు. అయితే వారిద్దరు అంత సన్నిహిత్యంగా మెలగడానికి అక్కడున్న పరిస్థితులు కారణం అయినప్పటికి.. పోలిటికల్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ అయింది. దీనిపై రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అని వీరిద్దరూ నిరూపించారని కొందరు అభినంధిస్తుంటే.. మరికొందరేమో విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిద్దరి కలయికపై తాజా సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారుతోంది. ” నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి. ” అంటూ చంద్రబాబు, విజయసాయి రెడ్డిలను ఉద్దేశించి ట్వీట్ చెఃశారు బండ్ల గణేశ్.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023
అయితే బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వారిద్దరి కలయిక ఆరోగ్యకరమైన రాజకీయాలకు సూచన అని, అలాంటి వాటిని కూడా వివాదాస్పదం చేయడం మనుకోవాలంటూ బండ్లకు హితవు పలుకుతునారు నెటిజన్స్. ఏది ఏమైనప్పటికి విజయసాయి రెడ్డి, చంద్రబాబులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇవి కూడా చదవండి..