‘మా’ ఎన్నికలపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

162
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో నిర్వహించనున్న ఈ ఎన్నికలకు ఈ ఏడాది పోటీ హోరాహోరీగా ఉండనుంది. నిన్నటివరకూ విడివిడిగా పోటీ చేస్తున్నారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ.. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో, ఈసారి ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు ప్రధాన పోటీదారులుగా మారారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే సినీ‘మా’ బిడ్డలు పేరుతో తన ప్యానెల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు సైతం పోటీలో గెలుపొందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాష్‌ రాజ్‌ పోటీ చేస్తే తప్పేంటి? అంటూ బండ్ల గణేశ్‌ ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌ను నాన్‌లోకల్‌ అనడం పట్ల బండ్ల మండిపడ్డారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాష్‌ రాజ్‌ తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారని.. ఆయన ఎలా నాన్‌ లోకల్‌ అవుతారని ప్రశ్నించారు.

సినిమాల కోసం ముంబై, కేరళ, కర్ణాటక నుంచి హీరోయిన్స్‌ని టాలీవుడ్‌లోకి తీసుకువస్తే తప్పులేదు కానీ ప్రకాష్‌ రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పా అని అన్నారు. అంతేకాకుండా ప్రకాష్‌ రాజ్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. కరోనా సమయంలో వందల కుటుంబాలను ఆయన ఆదుకున్నారని తెలిపారు. ఒకవేళ ప్రకాష్‌ రాజ్‌ ‘మా’ అధ్యక్షుడైతే తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని బండ్ల వ్యాఖ్యానిచ్చారు.

- Advertisement -