సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ ఎదిగాడు బండ్ల గణేష్. ఆ క్రమంలో ఇటీవలి కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు ఎదిగాడు. పవన్, ఎన్టీఆర్ లాంటి పలువురు స్టార్ హీరోలను పెట్టి సినిమాలు తీశాడు. ఇటీవల నిర్మాతగా సైలెంట్ అయిన బండ్ల .. కొద్ది రోజులుగా వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. హీరో సచిన్ జోషి విషయంలో బండ్ల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత ఆహీరో నుంచి కౌంటర్ అటాక్ ను రుచి చూశాడు.
తాజాగా బండ్ల గణేష్ విషయంలో సచిన్ జోషి చేసిన వ్యాఖ్యలను ఓ హీరోయిన్ పరోక్షంగా ప్రస్తావించడం మళ్లీ వివాదం రేపుతోంది. ఆ హీరోయన్ మరెవరో కాదు పవన్ కల్యాణ్ బంగారం మూవీ హీరోయిన్ మీరా చోప్రా. నిర్మాత బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అంటూ సచిన్ జోషిలాగే మీరా చోప్రా హాట్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత ఓ ట్వీట్ పెట్టి, వాటిని డిలీట్ చేసింది.
ఉన్నట్టుండి ఈ భామ బండ్ల గణేష్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. పనిలో పనిగా మీరా చోప్రాకి, బండ్ల గణేష్ కు, సచిన్ జోష్ కు మధ్య ఏం జరిగి ఉంటుందోనని ఇండస్ట్రీలో తెగ ఊహించేసుకుంటున్నారు.