వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం..

181
- Advertisement -

2017-18 సంవత్సరానికి గాను లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ. వసంత పంచమి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యనే లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెద్ద నోట్ల రద్దుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పరిపాలనలో మార్పులు తేవడమే మా లక్ష్యమని తెలిపారు. దేశ వృద్ధి రేటు పెరిగిందన్న జైట్లీ ఉద్యోగాల కల్పనలో దృష్టిసారించామని తెలిపారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అనిశ్చితిలో కొనసాగుతుందన్నారు.

ప్రజల డబ్బుకు ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరిస్తుందని … అణగారిన వర్గాలకు వృద్ధి ఫలాలు చేరాలన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ద్యవ్యలోటు 1 శాతం నుంచి .73 శాతానికి తగ్గిందన్నారు. నల్లధనాన్ని అరికడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆర్ధిక వృద్ధి పెరిగే అవకాశం ఉందన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయని తెలిపారు. సామాన్య ప్రజలు, యువకుల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే మరింత వృద్ధిరేటు సాధిస్తామని తెలిపారు.వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని తెలిపారు జైట్లీ.

రెండేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. పెద్దనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని దీనివల్ల బ్లాక్ మనీ, కరెప్షన్‌ తగ్గుతుందన్నారు.బ్యాంకులకు డబ్బు చేరిందని వడ్డీ రేట్లు తగ్గుతాయని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందన్నారు.

ప్రజలు ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారని తెలిపారు. బంధుప్రీతి, అవినీతికి దూరంగా పారదర్శకపాలనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపేశామని రైల్వేల స్వతంత్ర్య ప్రతిపత్తి కొనసాగుతుందన్నారు.

- Advertisement -