ముఖానికి మాస్క్ ధరించి కోర్టుకు హాజరైన బడా నిర్మాత..

232
Bandla Ganesh attend Court for Cheque Bounce Case
- Advertisement -

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే అతి తక్కువ టైంలోనే టాలీవుడ్‌ లో బడా నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అలాంటి బడా నిర్మాత ఓ కేసు విషయంలో విచారణకు హాజరయ్యే సమయంలో తన ముఖానికి గుడ్డకట్టుకొని కనిపించాడు.

 Bandla Ganesh attend Court for Cheque Bounce Caseఅసలు విషయానికొస్తే..బండ్ల గణేష్‌కు, ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది వడ్డీకి డబ్బులిచ్చారు. అయితే ఆ లావాదేవీలకు చెందిన చెక్కులను బండ్ల గణేష్‌ వారికిచ్చాడు. అవికాస్త బౌన్స్‌ అయ్యాయి. దీంతో, బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో మూడు కేసులకు సంబంధించి బండ్ల గణేష్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు లోక్ అదాలత్ లో మూడు కేసులకు సంబంధించి రాజీ అయినట్టు తెలుస్తోంది. కేసు విచారణ అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 9కి కోర్టు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే..ఈ విషయాన్ని తెలుసుకున్నవారంతా..అసలు బండ్ల గణేష్ ముఖానికి గుడ్డ కట్టుకోవాల్సిన అవసరమేంటని చర్చించుకుంటున్నారు.

- Advertisement -