ఇదేనా బీజేపీ సమన్యాయం?

46
- Advertisement -

తమ్ముడు తనవాడైన న్యాయం సరిగ్గా చెప్పాలనే సామెత వినే ఉంటాము. ఇది బీజేపీకి మాత్రం వర్తించదు. తాము తప్పు చేసిన అది ఒప్పని.. ఇతరులు అదే చేస్తే అది తప్పని నియంత ధోరణిలో బీజేపీ అధిష్టానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడి ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో రాహుల్ గాంధీ పై ఏకంగా కోర్టులో పిటిషన్ వేసి అనర్హత వేటు వచ్చేలా ప్రవర్తించిన బీజేపీ నేతలు.. వారే ఇతర పార్టీ నాయకులను అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది సమంజసమా ? ఏంటి ఈ ఆదిపత్య దొరణి.. సొంత పార్టీ వారికి ఒక న్యాయం బయటి వారికి మరో న్యాయం.. ఇదేనా బీజేపీ సిద్దాంతం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు..

ఇంతకి విషయమేటంటే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లోక్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కే‌సి‌ఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బి‌ఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని వ్యాఖ్యానించారు బండి సంజయ్. అయితే పార్టీపై ఈ రకమైన విమర్శలు సర్వసాధారణమే అయినప్పటికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కే‌సి‌ఆర్ ను ఒక కులానికి ఆపాదిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరుకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలమంది.

Also Read:‘భోళా శంకర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

మోడి ఇంటిపేరును ప్రస్తావించినందుకే అనర్హత వేటు పడేలా చేసిన బీజేపీకి.. సొంత పార్టీలోని నేత.. ఇతర పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ అధిష్టానానికి కనిపించడం లేదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో ప్రస్తావించారు. ” ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు ఓ కాంగ్రెస్ ఎంపీపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఓ బిజెపి ఎంపీ లోక్ సభలో తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి గా ఎన్నికైనా పాపులర్ సి‌ఎం కే‌సి‌ఆర్ ను అత్యంత నీచమైన భాషతో కించపరిచారు మేము ఇప్పుడేం చేయాలి స్పీకర్ సార్ ? ” అంటూ మంత్రి కే‌టి‌ఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో బీజేపీ నేతల దురహంకార తీరుపై నెటిజన్స్ మండి పడుతున్నారు.

Also Read:పవన్..ఓజీ ఓవర్సీస్‌ పార్ట్‌నర్‌ లాక్‌!

- Advertisement -