బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 38 మంది నేతలతో కూడిన జాబితాను ఇవాళ ప్రకటించారు జేపీ నడ్డా.
ఇటీవల తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు చోటు చేసుకోగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డిని కొత్త అధ్యక్షుడిగా నియమించింది. అలాగే ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురికి రాష్ట్ర పార్టీలో కీలక పదవులు అప్పగించింది.
Also Read:వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కు చిట్కాలు!
తెలంగాణ నుండి బండి సంజయ్‌తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నారు. ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సత్య కుమార్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ను కొనసాగించనున్నట్లు కేంద్ర పార్టీ అధిష్టానం వెల్లడించింది. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను నియమించింది.
Also Read:పవన్ ఆశలపై బీజేపీ నీళ్ళు చల్లుతోందా?