గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన శానంపూడి సైదిరెడ్డి

151
Shanampudi

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగతుంది. ఇప్పటికే 2కోట్ల వరకు దాటిన ఈగ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు హుజుర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి.

తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చి దిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు సైదిరెడ్డి. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం రోజురోజుకు వేగంగా విస్తరిస్తుందన్నారు . గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతున్న తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.