రాజ్‌భవన్‌ అధికారికి కరోనా..ఐసోలేషన్‌లో గవర్నర్ దత్తాత్రేయ!

136
bandaru dattatreya

హిమాచల్ ప్రదేశ్‌ రాజ్‌ భవన్ అధికారికి కరోనా సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 12,899కు చేరగా రాజ్‌భవన్‌ ఏడీసీ అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్న దత్తాత్రయే స్వీయ నిర్బందంలోకి వెళ్లారు.

హిమాచల్ ప్రదేశ్‌ కి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సుక్రామ్ చౌద‌రీ, జ‌ల‌శ‌క్తి మంత్రి మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌లకు ఇప్పటికే పాజిటివ్‌గా తేలగా వారిద్దరూ కోలుకున్నారు. వీరితో పాటు సురేంద‌ర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే రాకేశ్ జామ్వాల్‌, నాచ‌న్ ఎమ్మెల్యే వినోద్ కుమార్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలగా వారు కరోనా కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.