పార్టీలకు అతీతంగా అలయ్ బలాయ్‌కి విచ్చేయడం సంతోషకరం అన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. జలవిహార్‌లో దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి , మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఎంపీలు కేకే , రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , డిజిపి మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , రాజాసింగ్ , ముఠా గోపాల్ , రసమయి బాలకిషన్ , మేయర్ బొంతు రామ్మోహన్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , మురళీధర్ రావు , బిసి కమిషన్ చైర్మన్ రాములు , వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు హాజరయ్యారు…..
ఈ సందర్భంగా మాట్లాడిన దత్తాత్రేయ…మన పండుగలు దేశానికే గర్వకారణంగా ఉన్నాయని చెప్పారు. అవినీతి, అధర్మం పై విజయం కోసం కృషి చేద్దాం…టూరిజం, పరిశ్రమల ఏర్పాటు పై హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ని అనుసంధానం చేసేలా చూస్తానని తెలిపారు.
చెడు మీద మంచి విజయమే విజయదశమి….బతుకమ్మ, బోనాలు తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టాము….భావితరాలకు పండగ ప్రాధాన్యత తెలియజేయడానికే అలాయ్ బలాయ్ అన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం అని చెప్పారు.
దత్తాత్రేయ గారు నాకు మార్గదర్శం, ఆదర్శం అన్నారు గవర్నర్ తమిళ సై. తెలంగాణ గవర్నర్ గా రావడం నా అదృష్టం…15 ఏళ్లుగా దత్తాత్రేయ అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. తమిళనాడు, తెలంగాణ కు భౌగోళికంగా బార్డర్ ఉంది కానీ… సంస్కృతి సంప్రదాయాలు ఒకేలా ఉంటాయ్ అన్నారు. చిన్నపిల్లల టిఫిన్ బాక్స్ ల్లో బర్గర్లు, చిప్స్ ఉంటున్నాయి… చిన్నారుల్లో న్యూట్రిషన్ లోపిస్తోంది…చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేలా పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలన్నారు.
హిందూ సమాజంలో పండగలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కుటుంబాలను, బంధువులను, స్నేహితులను, సమాజాన్ని కలిపేవి పండుగలు…రాజకీయాలకు అతీతంగా అందరినీ కలిపేదే.. అలయ్ బలాయ్ అన్నారు.