హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చిక్కుల్లో పడ్డారు. విజిటర్స్ పాస్ తో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన బండ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. నోట్ల రద్దుపై ప్రధానిపై తీవ్రస్ధాయిలో విరుచుకపడ్డారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత బండ కార్తీకరెడ్డి అనుమతి లేకుండా రాహుల్ ప్రెస్ మీట్‌లో పాల్గొంది. వీవీఐపీ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తు కార్తీక రెడ్డి రాహుల్ వెనుక కూర్చుంది. రాహుల్‌కు కండువా కప్పింది. అయితే, ప్రెస్ మీట్‌లోకి ఎందుకు వచ్చావని రాహుల్… కార్తీక రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, అధికారులు కార్తీకరెడ్డికి నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బండ కార్తీకరెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తార్నాక డివిజన్ నుంచి పోటీ చేసిన కార్తీక రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సరస్వతి చేతిలో ఓడిపోయారు.