ఆ ముగ్గురు హీరోయిన్లతో యంగ్‌టైగర్‌…..

125
Three Rumoured heroines for NTR’s Next

జనతా గ్యారేజ్‌ చిత్రం తో పలు రికార్డులు తిరగ రాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత చిత్రం తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రవితేజ పవర్‌ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర అలియాస్‌ బాబీ…ఆ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా చేశాడు. ఇప్పుడు బాబీతో కొత్త సినిమాకి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓకే చెప్పేయగా….డైరెక్టర్‌ స్క్రిప్ట్‌ పనుల్లో పడిపోయాడు.

Three Rumoured heroines for NTR’s Next

ఈ సినిమాకు ముందు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. దీంతో కళ్యాణ్‌ రాం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జెట్‌స్పీడ్‌లో ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

అయితే ఈసినిమాలో హీరోయిన్స్‌ విషయంలో ఓ ఫైనల్‌ డెసిషన్‌కి వచ్చేశాడట యంగ్‌టైగర్‌,… టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌…మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌…జెంటిల్మెన్‌ హీరోయిన్‌ నివేదాథామస్‌లను దాదాపు ఓకే చేసేసినట్టే అని ఫిల్మ్‌నగర్‌లో గుసగులు వినిపిస్తున్నాయి.బాబీ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు పాత్రలు చేయనున్నాడని ఇటీవలే లీక్‌ అయ్యింది.ఈలీక్‌ పై జూనియర్‌ కూడా తీవ్ర అసహానం వ్యక్తం చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి.

Three Rumoured heroines for NTR’s Next

ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే జనవరిలో మొదలు పెట్టి జూన్ నాటికి కంప్లిట్‌ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్‌ తో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. దాదాపు సినిమా కన్ఫామ్ అయ్యినట్టే అనికూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వక్కంతం వంశీ, తమిళ్ డైరెక్టర్ ఇలా చాలా మంది పేర్లు వినిపించినా..చివరికి సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేం..బాబీకి అవకాశం ఇచ్చాడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాతో ప్లాప్‌ను చవిచూసిన బాబీ ఈ సినిమా తోనైన విజయన్ని సాధిస్తాడో లేదో వేచి చూడాల్సిందే మరి.

Three Rumoured heroines for NTR’s Next