టైం మెషిన్ లాంటి ఒక వింత వాహనం ఆకాశం నుంచి పంటపొలాల్లో పడింది. ఇది అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఆదిత్య 369లో ఉండే మెషిన్ లా ఉంది. వికారాబాద్ జిల్లాలోని వర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత మెషిన్ కొన్ని గంటల పాటు జనాన్ని వణికించింది.
నేలను తాకేలా ఉన్న డోర్…చుట్టూ అద్దాలను తలపించే కిటికీలు ఉన్నాయి. బెలూన్ ఆధారంగా వచ్చే నేలపై పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక జనం టెన్షన్ పడ్డారు. గ్రహాంతర శకటం అంటూ జోరుగా చర్చ జరిగింది. ఈ వింత మెషీన్‌ను చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. రెండు గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత నేలపై కుప్పకూలిపోయింది. జనాల్లో ఏర్పడిన భయాందోళనలను నిర్వీర్యం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హలో స్పేస్ మెషిన్ తాలూకా రీసెర్చ్ హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు. స్పెయిన్ మ్యాడ్రిడ్‌లో ఏర్పాటైన సంస్థ.. స్పేస్ టూరిజం కోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని తేల్చారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దీన్ని పంపినట్లు తెలిపారు. ఈ ప్రయోగం భారత ప్రభుత్వం సహాకారంతోనే జరిగినట్లు స్పష్టం చేశారు. ఇది ఐదు రోజులు స్పేస్‌లో ఉండేలా దీన్ని డిజైన్ చేశారని అధికారులు వివరించారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంత ఆకారం కలిగిన శకటం జనావాసలపై పడితే పరిస్థితి ఏంటని అధికారులను నిలదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…