బాలయ్య 105వ చిత్రం ప్రారంభం..

391
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఈ రోజు నుండి ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.

Nandamuri Balakrishna

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. `జైసింహా` వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు.

నటీనటులు:నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, కోటేశ్వర్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్, బండ రఘు తదితరులు.. సాంకేతిక నిపుణులు:దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్,బ్యానర్: హ్యాపీ మూవీస్,నిర్మాత: సి.కల్యాణ్,కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు,కథ: పరుచూరి మురళి,సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్,మ్యూజిక్: చిరంతన్ భట్,ఆర్ట్: చిన్నా,డ్యాన్స్: జానీ మాస్టర్,ఫైట్స్: రామ్ లక్ష్మణ్,పాటలు: భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి.

- Advertisement -