గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన డిసిపి పద్మజ..

235
dcp

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాగర్ కర్నూల్ ఎస్పీ సాయి శేఖర్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి జీడిమెట్ల డిసిపి కార్యాలయంలో డిసిపి పి వి పద్మజ మొక్కలు నాటారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎం.పి సంతోష్ కుమార్ ను అభినందించారు . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడమే కాదు నాటిన మొక్కలు మూడు సంవత్సరాలు కాపాడే బాధ్యత ఈ కార్యక్రమంలో ముఖ్యం. 2015-2017 లెక్కల ప్రకారం పచ్చదనం, అడవుల పెంపకంలో దేశంలో తెలంగాణ 5 స్థానంలో నిలవడం హరిత కీలక పాత్ర పోషించిందని జాతీయ అటవీ సర్వే నివేదిక తెలియజేసింది.

హరితహారంకి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశంలో మొదటి స్థానం తీసుకెళ్లే విధంగా , ప్రజల్లో మంచి అవగాహనా కల్పిస్తుందని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, హరితహారంలో భాగంగా 1800 మొక్కలు వ్యతిగత శ్రద్ధతో సహచరుల సహకారంతో మొక్కలు నాటారని, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఉసిరి మొక్క నాటి దానిని తన వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు సాయి శేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఛాలెంజ్ లో మరో ముగ్గురికి భారతి హోలీ కేర్ మంచిర్యాల జిల్లా కలెక్టర్, వాసం వెంకటేశ్వర్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రోహిణి డిసిపి సైబరాబాద్ క్రైమ్ గార్లకి ఛాలెంజ్ చేశారు.