‘అవతార్‌ 2’ వచ్చేస్తోంది..

169
Avatar 2

కెనడియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ చిత్రం ఎన్నో సంచనాలు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన సీక్వెల్ ‘అవతార్ 2’ షూటింగ్‌ను న్యూజిలాండ్ దేశంలో ప్రారంభించాడు. ‘అవతార్‌’ సినిమాలో వినియోగించిన గ్రాఫిక్స్‌ ప్రపంచ ప్రేక్షులతో ఔరా అనిపించాయి. అంతకు మించిన అద్భుతాలను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు దర్శకుడు జేమ్స్‌ కామెరున్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ సినిమాలు తీస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ‘అవతార్‌ 2’ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా పనులను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్‌ మాట్లాడుతూ… ‘అవతార్‌ 2’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అంతేగాక, ‘అవతార్‌ 3’ షూటింగ్‌ కూడా ఇప్పటికే 95 శాతం పూర్తయిందని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరులో ‘అవతార్‌ 2’ విడుదలవుతుందని ఆయన తెలిపారు. ‘అవతార్‌ 2’లో అండర్‌వాటర్‌ సీన్లు అధికంగా ఉంటాయని వివరించారు. అందుకోసం తమ సినిమా బృందం బాగా కష్టపడ్డారని వెల్లడించారు. ‘అవతార్’ సినిమాకు సంబంధించిన సీక్వెల్స్‌ను డిస్నీ సంస్థ నిర్మిస్తోంది.