ఎన్టీఆర్ చూసిన బాలయ్య…

404
Balakrishna Watches NTR Biopic

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు బాలయ్య. ఆయనతో పాటు విద్యాబాలన్‌,దర్శకుడు క్రిష్ సినిమా చూసి అభిమానులను ఉత్సాహపరిచారు.

థియేటర్‌ వద్ద అభిమానుల కోలాహలం.. జై బాలయ్య నినాదాలతో మార్మోగిపోయింది. అర్ధరాత్రి నుండే ఈ సినిమాకోసం నందమూరి అభిమానులు థియేటర్స్ వద్దకు క్యూ కట్టారు. జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తూ.. సంక్రాంతి పండుగను ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్‌.

Balakrishna Watches NTR Biopic

ప్రపంచ వ్యాప్తంగా 1100 పైగా స్క్రీన్స్ విడుదల చేయడం విశేషం. బాలకృష్ణ కెరియర్‌లోనే అత్యధిక స్క్రీన్స్‌పై విడుదలైన
సినిమాగా ‘కథానాయకుడు’ రికార్డులకెక్కింది. వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను సంయుక్తంగా ఎన్‌బీకే ఫిల్మ్ బ్యానర్‌లో నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. బుర్రా సాయిమాధవ్ మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.