సాహో బాలయ్య…శాతకర్ణి మహాకావ్యం

225
GPS Is History says Rajamouli
- Advertisement -

‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి’ అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.

సాహో బసవతారకమ్మపుత్ర బాలకృష్ణ అంటూ శాతకర్ణి పాత్రను పోషించినందుకు ఆయనకు రాజమౌళి సెల్యూట్ చేశారు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు. తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు.

ప్రీమియర్‌ షోలు చూసినవారంతా సినిమా చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ప్రేక్షకుల నుంచి పాజిటవ్ టాక్ వస్తోంది. సీన్స్, డైలాగులు, బాలయ్య నటన సినిమాతో అభిమానులు ఫిదా అయిపోయారు. శాతకర్ణి ఫీవర్‌తో అభిమానులు ఉబ్బితబ్బై పోతున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విజయవంతం కావాలని పలువురు తారలు ఆకాంక్షించారు. బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. బాబాయ్‌తో పాటు దర్శకుడు క్రిష్‌కు, సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్.  బాలయ్య సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మంచు విష్ణు, మంచు మనోజ్‌, నాని కూడా ట్వీట్లు పెట్టారు. పెద్ద సినిమాలో తాను నటించినందుకు గర్వపడుతున్నానని సీనియర్ నటి హేమమాలిని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు.

GPS Is History says Rajamouli

- Advertisement -