‘ఉగాది’కి బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌..!

262
bb3
- Advertisement -

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో, బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కొంతసేపు అఘోరా గెటప్ లో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ లుక్ లో బాలయ్య ఎలా ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ లుక్ ను ఇప్పుడు ‘ఉగాది’ సందర్భంగా రివీల్ చేయనున్నట్టు చెబుతున్నారు.

bb3 (1)

మే 28న విడుద‌ల కానున్న ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మోనార్క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఒరిజిన‌ల్ టైటిల్‌ని ఏప్రిల్ 13 మ‌ధ్యాహ్నాం 12.33ని.ల‌కు రివీల్ చేయ‌నున్నార‌ట‌. ఆ రోజు బాల‌కృష్ణ అభిమానులకు రెండు పండుగ‌లు వస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -