గాగుల్స్ విసిరిన బాలయ్య..!

241
Balakrishna throws goggles at camera
Balakrishna throws goggles at camera
- Advertisement -

బాల‌కృష్ణ 101వ సినిమా షూటింగ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుండగా సెప్టెంబర్ 29న మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. బాలయ్య బర్త్ డే (జూన్ 10) సంధర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.

తాజాగా బాలయ్య 101వ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఇందులో బాలయ్య సీన్ లో భాగంగా తన గాగుల్స్ ని కెమెరా వైపు విసిరేస్తాడు. ఈ వీడియో అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఇక బాలయ్య తన 101వ సినిమాతో సింగర్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. ‘మావా.. ఏక్ పెగ్ లావో’ అనే పాటను అనూప్ రూబెన్స్ .. బాలయ్య చే పాడించగా, అది అభిమానులకు మంచి కిక్ ఇచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. శ్రేయ శరన్, ముస్కాన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. బాల‌య్య అభిమానుల‌ను అల‌రిస్తోన్న వీడియోను మీరూ చూడండి..

- Advertisement -