నా కోడలికి బాగా నచ్చిందట..!

239
Nagarjuna tweet about samantha
Nagarjuna tweet about samantha
- Advertisement -

అక్కినేని నాగచైత‌న్య హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే. అమ్మాయి మనశ్శాంతికి హానికరం’ అంటూ వచ్చిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని నాగార్జున తాజాగా ట్వీట్‌ చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ట్రైల‌ర్ నాగ‌చైతన్య ప్రియురాలు, న‌టి స‌మంత‌కు బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న మామ‌య్య అక్కినేని నాగార్జునకు ఛాటింగ్ లో తెలిపింది.

ఆ ఛాటింగ్‌ను నాగార్జున త‌మ అభిమానుల‌తో పంచుకున్నారు. ‘ట్రైలర్‌ చాలా నచ్చింది, ఆయ‌న చాలా బాగున్నారు.. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.. థ్యాంక్యు’ అని అందులో స‌మంత పేర్కొంది. ఆమె చేసిన ఛాటింగ్ ను నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లోని ‘అమ్మాయి మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌ని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

17samantha-brk1a

- Advertisement -