ఇద్దరు భామలతో బరిలోకి బాలయ్య..!

336
- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల తర్వాత 2019 ఎన్నికల్లో బిజీగా గడిపిన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు తన 105వ సినిమాను స్టార్ట్ చేసాడు. బాలకృష్ణ హీరోగా సీనియర్ దర్శకులు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారనేది తాజా సమాచారం. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

Balakrishna

ఈ మూవీ తొలి షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారని సమాచారం. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్‌లో బ్యాంకాక్‌లో కొన్ని సన్నివేశాలను .. నాయకా నాయికలపై పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందే కథానాయికల్ని ఫైనల్ చేశారు చిత్ర బృందం. బాలయ్య సరసన లెజెండ్ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే వేదిక ఈ చిత్రంతో తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది.

- Advertisement -