బాలకృష్ణ..బాప్ ఆఫ్ ఆల్ టాక్‌ షోస్

25
nbk

బుల్లితెరపై నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతుండగా గురువారం అధికారికంగా ప్రకటించనుంది ఆహా సంస్థ. బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్ అంటూ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా ఈ మ్యాజికల్ షో అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట. మరి ఈ టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి..