నిర్మాతగా మారిన అవికాగోర్..!

26
avika

ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు చేరువైన బ్యూటీ అవికాగోర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా చాలాకాలం తర్వాత తిరిగి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ సారి హీరోయిన్‌గా కాదు నిర్మాతగా.

అవికాగోర్ నిర్మిస్తున్న తొలి చిత్రాన్ని అమేజింగ్ ఎక్స్ పీరియ‌న్స్ గా అభివ‌ర్ణించింది. ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రిపారు. తొలిసారి నిర్మాత‌గా మారిన అవికాగోర్ తన అనుభ‌వాల‌ను పంచుకుంది.

తొలిసారి సినిమా నిర్మిస్తుండ‌టం అద్బుత‌మైన అనుభవం. 10 రోజుల‌పాటు గోవాలో సినిమా చిత్రీక‌రించాం. అల‌లన్నీ చాలా భిన్నంగా ఉన్నాయని వెల్లడించింది. నిర్మాత‌గా ఉండ‌టం నాకు ఓ న‌టిగా మ‌రింత స‌హ‌నాన్ని నేర్పించింది. అంతేకాదు వ్య‌క్తిగా ఎలా ఎద‌గాలో చెప్పేందుకు సాయ‌ప‌డింది. నా ప‌ట్ల నేను చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా అని తెలిపింది. అయితే సినిమాకు సంబంధించిన వివ‌రాల‌పై సస్పెన్స్ లో ఉంచింది అవికాగోర్.