లైగర్‌తో అఖండ..వైరల్!

44
nbk

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా లైగర్ సెట్స్‌లో సందడి చేశారు అఖండ బాలయ్య.

గోవాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా బాలకృష్ణ సెట్లో ప్రత్యక్షం అయ్యారు. పూరీ, ఛార్మీ,విజయ్ ఆయనతో కలిసి ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ విజిట్ చేసి టీం అందరిని ఆశీర్వదించారు అని టీం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే, రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.