పవన్ ఫ్యాన్స్ ఇగోని సంతృప్తిపరిచిన బాలయ్య

41
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిన్న షూటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ కారు దిగగానే రిసీవ్ చేసుకోవడానికి అల్లు అరవింద్‌తో కలిసి బాలకృష్ణ ఎదురు చూసి మరీ వెల్కమ్ చెప్పారు. వీరిద్దరూ కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక షో లో పవన్ ఎంట్రీ కూడా భారీ గా ప్లాన్ చేసారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియా లో చకర్లు కొడుతున్నాయి.

గతంలో 2019 ఎన్నికల సమయంలో బాలకృష్ణ మీడియా ప్రతినిధితో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదే వ్యక్తిని మీ కోసం ఎదురుచూసేలా చేశావ్, ఇది మా అందరికీ గర్వకారణం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఏ మాటకామాటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఈ రెండిటినీ ఫ్యాన్స్ కంపేర్ చేస్తూ పెడర్థాలు తీయడం మానేస్తే బెటర్.

పవన్ ఎపిసోడ్ సంక్రాంతి తర్వాత ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఆహా లో ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -