ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రం ‘నాటునాటు’తో చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారమైంది అంటూ బాలయ్య – పవన్ కళ్యాణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
పవన్ కళ్యాణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త విని ఎంతో సంతోషించాను. ఆస్కార్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా నిలిచిన ‘నాటు నాటు’ ప్రపంచం నలువైపులా ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయించింది. ప్రతిష్ఠాత్మక స్టేజ్‌పై పాటను ఆలపించడం.. అవార్డును అందుకోవడంతో భారతీయ సినిమా ఖ్యాతి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత సొంతమయ్యేలా చేసిన దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్య ఇతర బృందానికి నా అభినందనలు’’ అని పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
బాలయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ప్రశంసిస్తూ.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్‌ను సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితోపాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి శుభాకాంక్షలు అని బాలకృష్ణ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..