నందమూరి బాలకృష్ణ ప్రసుత్తం తన వందో చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఈసినిమాపై భారీ అంచనలే వ్యక్తమవుతున్నాయి. జనవరి 12వతేదిన శాతకర్ణి విడుదలఅవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకే సెన్సార్ ఒక కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో బాలకృష్ణ అభిమానుల్లో సినిమా సూపర్‌హిట్ అని సంబరపడిపోతున్నారు.
బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. క్రమంలో ఈరోజు మధ్యహ్నం ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మీడియాతో ముచ్చటించారు. ఇకపై తనను “బసవ తారకరామ పుత్ర” గా పిలవాలని ఆయన సూచించారు. తనను బాలకృష్ణ పేరుతో కాకుండా ఈకొత్త పేరుతో పిలవాలన్ని ఆయన అన్నారు. కష్టాలెదురైనా పని పూర్తి చేసే పట్టుదల మా నాన్న ఎన్టీఆర్ నాకు నేర్పించారని…. స్త్రీ శక్తి తిరుగులేనిదని బాలయ్య కొనియాడారు. క్యాన్సర్ ఆస్పత్రి భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం క్రమబద్దీకరించిందని, అందుకు కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈసందర్భంగా అన్నారు.
అయితే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటసింహ నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. తెలుగు వాడి ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాకి సీఎం కేసీఆర్ పన్ను మినహాయింపు ఇచ్చారు. పన్ను మినహాయింపుపై హర్షం వ్యక్తం చేసిన బాలయ్య… కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు. గౌతమి పుత్ర శాతకర్ణి స్పెషల్ షోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు సీఎం. తప్పకుండా స్పెషల్ షోకి వస్తానని బాలయ్యకు తెలిపారు.