పెళ్లికి రెడీ అయిన తమన్నా..

124
Tamannah Ready For Pelli Choopulu..!

పెళ్లి కాని అమ్మాయిలను ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతుంటారు. ఇక సెలబ్రిటీలకైతే ఈ ప్రశ్నలు తరచు ఎదురవుతుంటాయి. ఇక మిల్కీ బ్యూటీ తమన్న గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ పెళ్లి ఎప్పుడంటే..‘జరిగినప్పుడు చెబుతానండి’ అని సమాధానం తుంటరి సమాధానం ఇస్తోంది. ఇప్పుడు తాజాగా పెళ్లిచూపులకు రెడీ అయ్యారు. అయితే ఇవి నిజమైన పెళ్లి చూపులు కావు రీల్‌ పెళ్లి చూపులు.

టాలీవుడ్ చరిత్రలో ‘పెళ్ళిచూపులు’ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దాదాపుగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏ సెంటర్స్..నైజామైన..యుఎస్‌ ఐనా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండ, రితూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దక్కించుకున్నారు. తమిళంలో కొత్త హీరోతో ఈ రీమేక్‌ని సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈ సినిమా రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు.తమన్నా స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందని గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలతో పాటు, ఆయన నిర్మించే సినిమాలు కూడా క్వాలిటీగా ఉంటాయన్న పేరుంది. ‘పెళ్ళిచూపులు’ రీమేక్ విషయంలోనూ గౌతమ్ ఎక్కడా తగ్గకుండా, తెలుగు వర్షన్ స్థాయిని అందుకునేలా తెరకెక్కించనున్నారట.