కేసీఆర్‌తో శాతకర్ణి భేటీ…స్పెషల్ షోకు ఆహ్వానం

240
Balakrishna meets CM KCR
- Advertisement -

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటసింహ నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా  భారతదేశ తొలిచక్రవర్తి గా గౌతమి పుత్ర శాతకర్ణి సాధించిన విజయగాదగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందో సినిమాగా  తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తెలుగు వాడి ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాకి సీఎం కేసీఆర్ పన్ను మినహాయింపు ఇచ్చారు. పన్ను మినహాయింపుపై హర్షం వ్యక్తం చేసిన బాలయ్య… కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు. గౌతమి పుత్ర శాతకర్ణి స్పెషల్‌ షోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు సీఎం. తప్పకుండా స్పెషల్‌ షోకి వస్తానని బాలయ్యకు తెలిపారు.

 Balakrishna meets CM KCR

గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన శాతవాహన మహారాజు. విశ్వశాంతి కోసం కృషి చేసిన యోధుడు. తెలుగు నేలను అప్రతిహతంగా పాలించిన రాజులు శాతవాహనులు. తెలుగు నేలను పాలించిన శాతవాహన రాజుల్లో 23వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యం విస్తరించింది. పాలన అంటే యుద్ధాలు మాత్రమే కాదు, కళలు, వైభవం, సాహిత్యం కూడా ఉంటాయని ఒకటో శతాబ్దంలోనే ప్రపంచానికి చాటిన కళాపురుషుడు శాతకర్ణి.

 Balakrishna meets CM KCR

గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ముహుర్తపు సన్నివేశానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టి…బాలయ్యకు దీవెనలు అందించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని ఆకాంక్షించిన కేసీఆర్…200 రోజులు ఆడాలని ఆకాంక్షించారు. “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రం తనకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని, “చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి, నేను ఫ్యామిలీతో వచ్చి చూస్తాను. చిరంజీవి, మేమంతా కలిసే చూడాలని…స్పెషల్ షో వెయ్యాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన బాలయ్య అభిమానుల కరతాల ధ్వనుల మధ్య ఓకే చెప్పారు. దీంతో ఇవాళ కేసీఆర్‌ని కలిసిన బాలకృష్ణ…స్పెషల్ షోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

- Advertisement -