తారకరత్న…రాజా మీరు కేక

141

హీరోగా ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారకరత్న. హీరోగా అవకాశాలు కలిసిరాక పోవటంతో చాలాకాలం గ్యాప్ తర్వాత తన అదృష్టాన్ని విలన్‌గా పరిక్షించుకుంటు ముందుకు వచ్చాడు. రాజా చెయ్యి వేస్తెతో అదృష్టాన్ని పరిక్షించుకున్న తారక్‌..మరో రెండు సినిమాలతో మెప్పించాడు. తాజాగా తారక్ విలన్‌గా తెరకెక్కుతున్న సినిమా రాజా మీరు కేక.

రేవంత్, నోయల్, మిర్చి హేమంత్, లాస్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కృష్ణకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముగ్గురు యువకుల జీవితాల్లో చోటుచేసుకున్న సరదా సంఘటనల సమాహారంగా చక్కటి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది.

Taraka ratna in Raja Meeru Keka

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో తారకరత్న తనదైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. సిరీయస్‌ లుక్‌లో చైర్‌పై కట్టేసి ఉన్న తారకరత్న పోస్టర్‌…ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విలన్‌గా జగపతిబాబుకు పోటీ ఇస్తున్న తారకరత్న…ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో యాంకర్‌గా పాపులరైన లాస్య….తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది.

Taraka ratna in Raja Meeru Keka