అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య, దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కథ కోసం బాలయ్య చూస్తున్నాడు. రచయిత కోన వెంకట్ ఓ కథ వినిపించాడు. బాలయ్యకి నచ్చలేదు. అలాగే మరో రచయిత గోపీ మోహన్ సైతం ఓ కథ వినిపించాడు. అది కూడా బాలయ్యకి నచ్చలేదు. మరో వైపు దర్శకుడు వివి వినాయక్ కూడా ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. దాన్ని కూడా బాలయ్య పక్కన పెట్టాడు. మొత్తమ్మీద బాలయ్య గతంలో ఎన్నడూ ఓ కథ కోసం ఇంతలా ఎదురుచూడలేదు. బాలయ్య ఎదురుచూపులకు ఓ కారణం ఉంది. ఇంతకీ బాలయ్య ఎవరి కోసం కథ వింటున్నాడో తెలుసా ?, కొడుకు మోక్షజ్ఞ తేజ్ కోసం.
తాను చేయబోయే సినిమాలో మోక్షజ్ఞను మొదట ఓ పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. సో.. బాలయ్య – మోక్షజ్ఞ కలయికలో ఓ కథ కావాలి. అదే ఇప్పుడు టార్గెట్. జనాలను ఎంటర్ టైన్ చేయాలి తప్ప, తన ఇమేజ్ దాటి ప్రయోగాలు చేసినా నడవదని బాలయ్యకి తెలిసి వచ్చినట్లుంది. ఆ సంగతి ఎలా వున్నా, అఖండ తర్వాత బాలయ్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మోక్షజ్ఞ తేజ్ ఎంట్రీకి కూడా టైమ్ వచ్చింది. పైగా బాలయ్య టైమ్ కూడా ఇప్పుడు చాలా బాగుంది.
Also Read:సలార్ దరిదాపుల్లో లేని కల్కి..?
అందుకే మోక్షజ్ఞ తేజ్ మొదటి సినిమా మీద బాలయ్య దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు మాస్ డైరక్టర్లతో చాలా కాలంగా టచ్ లో వున్నారు బాలయ్య. వారు చెప్పిన ఐడియాలు విని వున్నారు. కానీ ఏదీ కాంక్రీట్ గా ఒకే కాలేదు. సరైన కథ దొరికే వరకు ఓకె అనే ఆలోచన బాలయ్యకి అయితే లేదు. అలా కథ ఓకే అయితే.. దర్శకుడు ఎవరు అన్న దాని పైన చర్చలు ఉంటాయి. మొత్తానికి కొడుకు కోసం బాలయ్య అసలు కాంప్రమైజ్ కావడం లేదు.
Also Read:వైసీపీకి వార్నింగ్..సీట్ ఇవ్వకపోతే అంతే!