బాలయ్య, క్రిష్ లది బ్యాడ్ కాంబినేషనట..!

105

గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రమోషన్లో భాగంగా దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా క్రిష్‌ను ఇంటర్వ్యూ చేసాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. బాలయ్య-క్రిష్ కాంబినేషన్ అనే విషయం తెలియగానే బ్యాడ్ కాంబినేషన్ అని ఫీలయ్యాడట రాజమౌళి. ఈ సినిమాను ప్రారంభించిన తర్వాత.. ఫ్లాప్ గ్యారెంటీ అనుకున్న అనేకమందిలో తాను కూడా ఒకడినని రాజమౌళి చెప్పుకొచ్చారు.

తన మనసులో అనుకున్న మాటను జక్కన్న ఇలా నిజాయితీగా బయట పెట్టడం అందరినీ ఆశ్యర్చ పరిచింది. అంతే కాదు… ప్లాప్ అని భావించిన మా లాంటి వారి అభిప్రాయాలు తప్పని నిరూపించేలా సినిమాను హిట్ చేసినందుకు థాంక్స్ అంటూ క్రిష్ ను అభినందించాడు. రాజమౌళి అలా భావించడానికి కారణం…బాలయ్య మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావడమేనట. బాలయ్య ఇప్పటి వరకు చేసిన సినిమాలకు….. క్రిష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పొంతన లేక పోవడంతో రాజమౌళి అలా భావించాడట. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇలాంటి సినిమా ఒకటి రాబోతుందని తెలియగానే హిట్టవుతుందనే నమ్మకం కలగలేదట.

Balakrishna, krish combination Bad

అయితే.. క్రిష్ కథ చెప్పాక జక్కన్న ఆలోచనలో మార్పు వచ్చిందట. బాలయ్యకు సూటయ్యే ఎమెషన్స్ సినిమాలో ఉండటం, తల్లి, భార్య సెంటిమెంట్ బాగుండటంతో హిట్ అయిపోద్దనే నమ్మకం క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చిందని రాజమౌళి తెలిపారు. అన్నట్టు రాజమౌళి ఈ సినిమా కోసం.. క్రిష్ కు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. అది కూడా శాతకర్ణికి ప్లస్ అయ్యిందని క్రిష్ స్వయంగా చెప్పాడు. ఏదేమైనా.. ఈ దర్శకుల మధ్య ఇలాంటి వాతావరణం ఆహ్వానించతగ్గ పరిణామం.