కోర్టు మెట్లు ఎక్కనున్న శ్రీమంతుడు…!

272
- Advertisement -

మహేష్‌బాబు హీరోగా ‘శ్రీమంతుడు’ సినిమా బాక్స్‌ఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.’ఊరిని దత్తత తీసుకోవడం’ ఈ సినిమా సారాంశం. ఊరిని ఉద్ధరించే కథాంశాలు తెలుగు తెరపై చాలా వచ్చిన..వాటికి కంటే కొంచెం డిఫెరంట్‌గా ఈసినిమా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. కానీ ఇప్పుడు ఈసినిమా వివాదంలో చికుక్కొని మహేశ్ బాబుకు తలనొప్పిగా మారింది.

Srimanthudu Story Controversy

అసలు విషయం ఏంటంటే….శ్రీమంతుడు సినిమా కథ తనదేనని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన నవలనే కాపీ కొట్టి సినిమా తీశారన్నది శరత్‌చంద్ర ఆరోపణ. తాను రాసిన ‘‘చచ్చేంత ప్రేమ’’అనే నవలను కాపీ చేశారని.. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేశ్ బాబుకు..చిత్ర దర్శకుడు కొరటాల శివ.. నిర్మాత ఏర్నేని నవీన్ లను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120బీ.. కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేసారు.

Srimanthudu Story Controversy

ఇటీవలే ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా విషయంలోనూ ‘కాపీ’ వివాదం తెరపైకొచ్చింది. తమిళంలో తీసిన ‘కత్తి’కి ‘ఖైదీ నెంబర్‌ 150’ రీమేక్‌. అయినా, ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి రచ్చ చేసాడు. ఆ వివాదం ఎలాగో సర్ధుకుపోయింది…ఇప్పుడు శ్రీమంతుడు వివాదం ఏమవుతుందో వేచిచూడాల్సిందేమరి.

- Advertisement -