శాతకర్ణి ఖచ్చితంగా హిట్ అవుతుంది..

175
Nandamuri
- Advertisement -

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విజయవంతం కావాలని జైయాత్ర చేపట్టిన నందమూరి అభిమానులకు నటసింహాం బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. 100వ సినిమా సందర్భంగా దేశవ్యాప్తంగా 100 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు అభినందలు తెలియజేశారు. సర్వమత సౌబ్రాతృత్వంతో యాత్రతో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ యాత్ర ఇంతగొప్పగా విజయంవంతం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. యాత్రలో పాల్గొన్న అభిమానులకు బాలయ్య శాలువతో సన్మానించారు. తనను అభిమానించే తన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అలాగే తన కష్టనష్టాల్లో తన వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.

Gautamiputra

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు బాలయ్య. అన్ని రుచులని మేళవించి దర్శకుడు క్రిష్ అందంగా తీశాడన్నారు బాలయ్య. కచ్చితంగా ఈసినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని తెలిపారు. ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాను సాహసం చేసి తీసినందుకు నిర్మాతలకు బాలయ్య కృతజ్ఙత తెలిజయేశారు. 100వ సినిమా కోసం తాను చాలా సతమతమైయ్యాయని..కొన్ని కథలు కూడా నచ్చాయని కానీ నా అదృష్టం కొద్ది ఈ సినిమా వచ్చిందని తెలిపారు. అలాగే ఈసినిమాకు ట్యాక్స్ ఎగ్జెమ్‌షన్ ఇచ్చినందుకు రెండు రాష్ట్ర్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞత తెలిపారు. సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుందన్నారు. సినిమా విడుదల రోజు మహిళకు కుంకుమ అర్చన ఇస్తారన్నారు.
Gautamiputra
నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలు పెరిగాను. నేను అనుకుంటే ఈపాటికి 200 సినిమాలు తీసేవాన్ని కానీ..ఎన్నిసినిమాలు చేశామన్నది కాదు..ఎంతమంచి సినిమాలు చేవామన్నదే ముఖ్యమని అన్నారు. బాలయ్య వందో సినిమా సందర్భంగా ఆదివారం వంద థియేటర్లలో బాలక్రిష్ణ సినిమాలను ప్రదర్శించనున్నారు.

- Advertisement -