రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ భూసేకరణ పూర్తి: ఎర్రబెల్లి

36
errabelli

వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూసేకరణ పూర్తయిందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 150.05 ఎకరాల భూమిని రైల్వే అధికారుల‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌మంతా క‌లిసి ఢిల్లీకి వెళ్తాం. ఆరు నూరైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామ‌ని చెప్పారు.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ద‌శాబ్దాల కాలం నాటి ఆకాంక్ష రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. పురాత‌న కాలంనాటి కాజీపేట జంక్షన్‌కు అప్పుడెప్పుడో మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ అనుకోని ప‌రిస్థితుల్లో వేరే రాష్ట్రానికి త‌ర‌లిపోయింద‌న్నారు. అయితే, కోచ్ ఫ్యాక్టరీకి బ‌దులు రైల్వే వాగ‌న్ ఓవ‌ర్ హోలింగ్ వ‌ర్క్ షాప్ ప్రాజెక్టు వ‌చ్చింద‌న్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీలు క‌డియం శ్రీ‌హ‌రి, బ‌స్వరాజు సార‌య్య‌, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, వ‌రంగ‌ల్ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా సత్పతి కాజీపేట రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.