అనిల్ రావిపూడితో సినిమా.. బాలయ్య క్లారిటీ..

188
Balayya
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ట ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. షూటింగ్‌ చివరి దశకి చేరుకున్న ఈ సినిమా, దసరాకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. కథానాయికగా శ్రుతి హాసన్ .. కీలకపాత్రకిగాను వరలక్ష్మి శరత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా ఉండనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులతో జూమ్ మీట్ నిర్వహించిన త్వరలో అనిల్ రావిపూడితో తన సినిమా ఉండనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లైన్లోనే ఉందనే విషయాన్ని గట్టిగానే చెప్పారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో సినిమా చేయనున్నందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -