ఏపీ ప్రతిపక్ష నేతగా బాలకృష్ణ..!

366
balakrishna
- Advertisement -

ఏపిలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభంజనంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. టిడిపి చరిత్రలో ఇంత ఘోర ఓటమిని ఎన్నడూ చవిచూడలేదు. వైసీపీ ఏకంగా 151 సీట్లలో గెలుపొందితే టీడీపీ కేవలం 23 స్ధానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్ లీడర్‌గా జగన్‌ ఎన్నికకావడం ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన టీడీపీ నుంచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటారనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. చంద్రబాబు రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటంతో సభానాయకుడిని ఎదుర్కునే విషయంలో చంద్రబాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా తన స్థానంలో మరో సీనియర్‌ని నియమించి తాను తప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు కాదనకుంటే తొలుత బాలయ్య పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. బాలయ్యతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,బలరాం,చినరాజప్ప,పయ్యావుల పేర్లు వినబడుతున్నాయి.

కొంతమంది నేతలు బాలకృష్ణను ప్రతిపక్ష నాయకుడిని చేస్తే పార్టీకి లాభిస్తుందని చెబుతుండగా మరికొందరు మాత్రం ఆయన్ని తిరస్కరిస్తున్నారు. బాలకృష్ణను ప్రతిపక్ష నాయకుడిని చేస్తే రోజుకో వివాదం ఉంటుందని ..వివాదాలను కొనితెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు మనసులో ఏముందనేది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.

- Advertisement -