ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

286
Stephen Raveendra

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులైనట్లు సమాచారం. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డికి చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. రాయలసీమలో చాలా ఏళ్లు పనిచేసిన ఆయన మావోలు,ఫ్యాక్షనిస్టులను కట్టడిచేయగలిగారు.

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత .. పూర్తిస్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్‌కు పేరుంది.