కరీంనగర్‌ ఎల్‌ఎండీ నుండి నీరు విడుదల:గంగుల

21
gangula

కరీంనగర్ ఎల్‌ఎండీ నుండి నీటిని విడుదల చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఏడు జిల్లాలకు తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు లోయర్ మానేరు డ్యామ్ నుండి 7 జిల్లాలకు యాసంగి పంట కోసం నీటిని విడుదల చేశామన్నారు. 9 లక్షల ఎకరాలకు ఏప్రిల్ 10 వరకు సాగు నీరు అందుతుందన్నారు. 15 రోజులుకు ఒక టీఎంసీ చొప్పున 7 విడతల్లో 8 టీఎంసీ లు విడుదల చేస్తామన్నారు.

7 జిల్లాలోని 33 మండలాలకు నీటిని అందిస్తున్నట్లు గంగుల కమలకర్ వెల్లడించారు. ఎల్ ఎమ్ డి లో 23 టీఎంసీ ల ప్రస్తుతం నీరు నిల్వ ఉందన్నారు. మొదటి సారి 2009 ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వరంగల్ కు నీటి విడుదల పై నేనే అడ్డుకున్న అని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య పోలీస్ పహారలో నీటిని వరంగల్ కు తరలించుకున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయని చెప్పారు. దేశంలో నీటి యుద్దాలు జరుగుతునే ఉన్నాయి కాని ఒక్క తెలంగాణ లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు.