బాలయ్య వేగం కుర్రాళ్లకు కూడా కష్టమే !

83
nbk
- Advertisement -

బాలయ్య బాబు సినిమాల గురించి రోజుకో వార్తని రాస్తున్నాయి వెబ్ సైట్ లు. ముహుర్తాలు అంటూ, రెగ్యులర్ షూటింగ్ అంటూ రకరకాల వార్తలు. ప్రధానంగా మూడు సినిమాల గురించి ప్రచారం జరుగుతోంది. అందులో.. అనిల్ రావిపూడి సినిమా, పరుశురామ్ – బాలయ్య సినిమా, అఖండ 2 గురించి. ఇందులో అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేది ఎప్పటి నుంచో నలుగుతున్నదే. అలాగే, పరుశురామ్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా కి సంబంధించిన న్యూస్ కూడా ఆ మధ్య పరుశురామ్ నే స్వయంగా చెప్పాడు.

అలాగే అఖండ 2 స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ రెడీగా ఉందని బాలయ్య రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు. మరి అనిల్ రావిపూడి సినిమా తర్వాత ఏ సినిమా స్టార్ట్ అవుతుంది ?. బాలయ్య, పరుశురామ్ తో ముందుకు వెళ్తాడా ?, లేక బోయపాటితోనా ?, బోయపాటికి బన్నీతో ఒక సినిమా కమిట్ మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే బాలయ్య మరో సినిమా అంటే కష్టమే. అందుకే.. అఖండ 2 ఇప్పట్లో స్టార్ట్ కాదు. అలాగే పరుశురామ్ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే.

అప్పటి లోపు బాలయ్య అనిల్ రావిపూడి సినిమా పైనే ఉంటాడు. మధ్యలో వచ్చిన గ్యాప్ లో తన టాక్ షో చేస్తాడు. అయితే.. బాలయ్య అనిల్ రావిపూడి, సినిమాని వేగంగా పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు. జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ చేస్తే.. ఫిబ్రవరిలో పూరితో ఒక సినిమా పూర్తి చేసి.. సమ్మర్ లో రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి బాలయ్య వేగం కుర్ర హీరోలకు కూడా కష్టమే.

ఇవి కూడా చదవండి…

- Advertisement -