గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో మంచి జోష్ మీదున్న బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమాల వేగం పెంచేశాడు. ఇప్పటికే పూరి దర్శకత్వంలో 101వ చిత్రానికి క్లాప్ పడగా ఇవాళ్టి నుంచి షూటింగ్ కూడా మొదలైంది. సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పూరి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.
ఇక తొలిరోజే బాలయ్యతో ఓ ఫైటింగ్ సీన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. 5 రోజులపాటు జరగనున్న ఈ తొలి షెడ్యూల్లో ఓ కీలకమైన ఫైటింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారవలేదు. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ గురించి ట్వీట్ చేసిన పూరి జగన్నాథ్.. బాలకృష్ణ ఎంతో ఎనర్జిటిక్‌గా షూటింగ్లో పాల్గొన్నట్టు ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా కోసం ముగ్గురు కొత్త హీరోయిన్లను పూరి తీసుకోబోతున్నాడట. దీంతో పాటు సినిమా ప్రధాన విలన్, బాలయ్య పక్కనే సినిమా ఫుల్ లెంగ్త్ లో ఉండే ఓ కమెడియన్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం 12 మంది కొత్త వారిని తీసుకోవాలని పూరి ప్లాన్ చేస్తున్నారు. కొత్త వారిని తనదైన స్టైల్ లో ట్రైనింగ్ ఇచ్చి…. తనకు కావాల్సిన విధంగా వారిని నుండి పెర్ఫార్మెన్స్ ను పిండుకోవాలని పూరి ప్లాన్ చేస్తున్నారు.
పూరి సినిమా అంటేనే పంచ్ డైలాగులు తప్పకుండా ఉంటాయి. మరి పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలో ఆరితేరిన బాలయ్య పంచ్ డైలాగులు పేలిస్తే ఎలా ఉంటుందో అని అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.